కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య (Twins Murder) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 3న జూబ్లీ నగర్ (Jubilee Nagar)లో కచ్చు శ్రీశైలం అనే వ్యక్తి కవల పిల్లలైన తన కుమార్తెలు ఇద్దరిని బావిలో తోసి హత్య చేశాడు. ఆడపిల్లల్ని కన్నందుకు భర్త శ్రీశైలంతో పాటు అత్తమామలు, అతడి సోదరులు తనను వేధించే వారని శ్రీశైలం భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశైలంతో పాటు హత్యకు సహకరించిన అతడి తల్లిదండ్రులు అశోక్, లావణ్య, సోదరుడు రాకేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.
శ్రీశైలం ఆరేళ్ల క్రితం మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కవలలు పుట్టాక భార్యతో శ్రీశైలానికి గొడవలు మొదలయ్యాయి. ఆడపిల్లలు పుట్టారనే ద్వేషంతోనే తరచూ మౌనిను కుటుంబమంతా వేధించసాగింది. ఇటీవల భార్యతో గొడవ పడ్డ శ్రీశైలం ఆమెపై కోపంతో సొంత కూతుళ్లనే బావిలో తోసి చంపేశాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కఠినం, కర్ణాటకలో స్వేచ్ఛ!
Follow Us On: Facebook

