రహానే నంబర్ 3లో రావాలి: మురళీ కార్తీక్

క‌లం, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) 2026లో వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)కు మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ (Murali Kartik) కీలక సూచనలు చేశారు. ఏప్రిల్ 6న పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరులో కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఓపెనింగ్‌కు బదులు నంబర్ 3లో రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రహానే విఫలం కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరాన్ గ్రీన్ ప్రస్తుతం బౌలింగ్ చేయలేకపోతున్నారని, బ్యాటింగ్‌లోనూ కేవలం 20 పరుగులే చేశారని కార్తీక్ గుర్తు చేశారు. అందుకే గ్రీన్ స్థానంలో న్యూజిలాండ్ హిట్టర్ టిమ్ సీఫెర్ట్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఫిన్ అలెన్, సీఫెర్ట్ జంట ఓపెనింగ్‌కు వస్తే కేకేఆర్‌కు మెరుగైన ఆరంభం దక్కుతుందని కార్తీక్ విశ్లేషించారు.

మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన సీఫెర్ట్, అలెన్ జోడీ కేకేఆర్‌కు బలమైన పునాది వేయగలరని వాన్ పేర్కొన్నారు. కేకేఆర్ ప్రధాన బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఫామ్ కోల్పోవడం జట్టును దెబ్బతీస్తోందని మురళీ కార్తీక్ (Murali Kartik) ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నంబర్ 1 టీ20 బౌలర్ వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు ఇస్తుండటంపై మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. వరుణ్ మీడియం పేసర్ తరహాలో వేగంగా బౌలింగ్ చేస్తున్నారని, అందుకే బ్యాటర్లు సులభంగా ఆడుతున్నారని ఆయన విశ్లేషించారు. ప్రపంచకప్‌లో డేవిడ్ మిల్లర్ వరుణ్‌ను ఎదుర్కొన్న విధానాన్ని అందరూ అనుసరిస్తున్నారని, దీనిపై వరుణ్ దృష్టి పెట్టాలని సూచించారు.

Read Also: మందుబాబులకు బ్యాడ్​ న్యూస్​.. వచ్చే నెలలో లిక్కర్ రేట్ల పెంపు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>