కలం, సెంట్రల్ డెస్క్: Online Love | ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వినయ్, జ్యోతి ఫ్రెండ్స్ అయ్యారు.. ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఆ ఇద్దరినీ ఒక్కటి చేసిందో.. అదే వారి మధ్య చిచ్చు పెట్టింది. జ్యోతి సోషల్ మీడియా అకౌంట్స్‌ను వినయ్ చూడటంతో గొడవ మొదలై.. చివరికి ఆమెను అతడు హత్య చేసే వరకు వెళ్లింది. జ్యోతిని చంపిన తర్వాత వినయ్ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది హైదరాబాద్ చైతన్యపురిలో జరిగిన ఘటన.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇషికకు ఫేస్‌బుక్‌లో నీరజ్ పరిచయమయ్యాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇషికది బిహార్.. నీరజ్‌ది మధ్యప్రదేశ్. ఇద్దరూ హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ మియాపూర్‌లో కాపురం పెట్టారు. ఇషికకు నీరజ్ నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేక ఉరేసుకొని చనిపోయింది.
డిగ్రీ చదువుతున్న కీర్తి రెడ్డికి సోషల్ మీడియాలో శశికుమార్‌తో స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఊరూపేరు తెలియని వ్యక్తితో ప్రేమ ఎందుకని తల్లి మందలించడంతో.. ఆమెను అడ్డు తొలగించుకోవాలని శశితో కలిసి చంపేసింది. ఇది కూడా హైదాబాద్‌లో జరిగిన ఘటనే!!
ఇలా ఒకటా రెండా? సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు.. అయితే ప్రాణాలు పోగొట్టుకోవడం, లేదా తోడు వచ్చినవాళ్లను చంపడం, వ్యతిరేకించారని కన్నవాళ్లనే కడతేర్చడం వరకు వెళ్తున్నాయి. పచ్చని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ముక్కూమొఖం తెలియని వ్యక్తులతో జరిగే సోషల్ మీడియా స్నేహాలు డెత్ ట్రాప్‌కు దారితీస్తున్నాయి.
అరచేతిలోని స్మార్ట్‌ఫోన్.. హాయ్ అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు.. ఒక్కసారి ఓకే చెప్పి టచ్‌లోకి వెళ్లామంటే ఇల్లు, ఒళ్లు, లైఫ్ మటాష్!! సోషల్ మీడియా వేదికగా చెప్పే తియ్యటి మాటలు నమ్మి, కుటుంబ నేపథ్యం తెలియకుండానే చేసుకునే పెళ్లిళ్లు.. కొద్ది రోజులకే అనుమానం, విభేదాల కారణంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ‘నువ్వే నా ప్రపంచం’ అని సోషల్ మీడియాలో చెప్పుకుని ఊహల్లో తేలినవాళ్లే.. పెండ్లి తర్వాత ‘హంతకులు’గా మారుతున్న ఘటనలు కోకొల్లలు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే శత్రువులుగా చూస్తున్న విపరీత ధోరణి పెరిగిపోతున్నది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ వంటి వారు నిత్యం సోషల్ మీడియా వేదికగానే ఎంతో అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. డిజిటల్ ‘డెత్ ట్రాప్’ ఉచ్చులో చిక్కుకుంటున్న బాధితుల్లో 70 శాతం మంది 30 ఏళ్లలోపు వారే. వీటిపై ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: తెలంగాణ డీలిమిటేషన్ : ‘క్యూర్’లో పట్టు కోసం పార్టీల వ్యూహాలు
Follow Us On : WhatsApp

