Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి ప్రభుత్వ కాలేజీల‌తో పురావస్తు శాఖ ఒప్పందం!

కలం మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర పురావస్తు, వారసత్వ శాఖ సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కీల‌క‌ అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక విలువలపై అవగాహన పెంచ‌డంతో పాటు వారసత్వ పరిరక్షణలో బాధ్యతాయుత పాత్ర పోషించేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందంపై తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కూతడి, సంబంధిత ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌లు సంతకాలు చేశారు.

ఈ ఎంవోయూలో భాగస్వామ్యులైన‌ కళాశాలల్లో విద్యార్థుల్లో వారసత్వ సంప‌ద‌పై అవగాహన పెంపొందించడం, పురావస్తు సంపద పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేయడం, స్థానిక చారిత్రక స్థలాలపై పరిశోధనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కళాశాల స్థాయిలో హెరిటేజ్ క్లబ్‌ల ఏర్పాటు, ఫీల్డ్ విజిట్స్, వర్క్‌షాపులు, కొత్త ప్రాంతాల అన్వేషణ, తవ్వకాలపై సదస్సులు నిర్వహించబోతున్నట్టు అధికారులు తెలిపారు.

Read Also: నేను విదేశీ ప్లేయర్‌నా?: వైరల్ జోక్స్‌పై విరాట్ కోహ్లీ ఫన్నీ రియాక్షన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>