కలం, సెంట్రల్ డెస్క్: Gulf Tourism | మొన్నటి దాకా ప్రపంచ పర్యాటకులతో కిటికిటలాడిన గల్ఫ్ దేశాలు.. ఇప్పుడు యుద్ధ భయంతో వెలవెలబోతున్నాయి. ఎడారిలో అద్భుత కట్టడాలు, సముద్ర గర్భంలో కృత్రిమ ద్వీపాలు, ఆధ్యాత్మిక శిఖరాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 2025లో రూ.15.34 లక్షల కోట్ల రికార్డు ఆదాయాన్ని గడించిన గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను ఇరాన్ వార్ కుదేలు చేసింది. నిరంతరం యుద్ధ భయం.. ఎప్పుడు ఏ క్షిపణి దూసుకొస్తుందో తెలియని ఆందోళనతో పర్యాటకులు ఆ వైపు చూడటం లేదు. ఎక్కడ చూసినా వార్ కారణంగా శిథిలమైన భవనాలు.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న స్థానికులే కనిపిస్తున్నారు.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, సౌదీలోని మక్కా, ఒమన్‌లోని మస్కట్.. ఇలా కీలక టూరిజం స్పాట్లను వార్ సెగ అతలాకుతలం చేస్తున్నది. ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాలో సందర్శకుల తాకిడి 50 శాతం డౌన్ అయింది. సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అల్-ఉలా చారిత్రక కేంద్రం వద్ద టూరిస్టులు మచ్చుకైనా కనిపించడం లేదు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు షూటింగ్ కోసం ఎక్కువగా దుబాయ్‌కు వెళ్తుంటాయి. నెల రోజుల నుంచి ఒక్క ఇండియన్ మూవీ కూడా అక్కడ షూటింగ్ జరుపుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దుబాయ్‌లో ప్రస్తుతం 90 శాతం షూటింగ్‌లు నిలిచిపోయాయి.
గల్ఫ్ దేశాలను భారత్ నుంచి పొలిటికల్ లీడర్స్, బిలియనీర్స్ రెగ్యులర్‌గా విజిట్ చేస్తుంటారు. ఫ్యామిలీస్‌తో కలిసి అలా తిరిగి వస్తుంటారు. తెలంగాణ నుంచే ఏటా గల్ఫ్ వెళ్లే పర్యాటకుల సంఖ్య 15 లక్షలు. కానీ, ఇప్పుడు వార్ కారణంగా వాళ్లు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి టూరిజానికి దుబాయ్ ప్రభుత్వం రూ.2,530 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అది ఎంత వరకు పూర్వవైభవాన్ని తెస్తుందన్నది ప్రశ్నార్థకం. వార్తో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినప్పటికి అక్కడి టూరిజంను ఇరాన్ ఎలా ప్రభావితం చేస్తుందో పూర్తి వివరాలతో ‘కలం 360 డిగ్రీస్‘ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: 20 ఏళ్లలో తొలిసారి.. ట్రంప్ కు భారీ షాక్!
Follow Us On : WhatsApp

