ప్రేమ వివాహాలపై కీలక నిర్ణయం.. గుజరాత్‌లో కఠినం, కర్ణాటకలో స్వేచ్ఛ!

కలం, వెబ్ డెస్క్: ప్రేమ వివాహాల (Love Marriage) విషయంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు పూర్తి భిన్నమైన వైఖరిని అవలంబిస్తున్నాయి. గుజరాత్ (Gujarat) ప్రభుత్వం ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేస్తోంది. నూతన నిబంధనల ప్రకారం.. పెళ్లి రిజిస్ట్రేషన్ సమయంలో తల్లిదండ్రుల వివరాలు సమర్పించడం, వారికి ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. అలాగే 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాతే వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. ఈ నిబంధనలు మోసపూరిత వివాహాలను అరికడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని కొందరు విమర్శిస్తున్నారు.

మరోవైపు కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మేజర్లు తమ ఇష్టానుసారం పెళ్లి (Love Marriage) చేసుకునే హక్కును పూర్తిస్థాయిలో సమర్థిస్తోంది. ఈ చట్టం ప్రకారం ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యుల అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రేమ జంటలకు రక్షణ కల్పించడం, పరువు హత్యలను అరికట్టడానికి కఠిన శిక్షలను ఈ చట్టంలో పొందుపరిచింది. ఈ నిర్ణయం ‘లవ్ జిహాద్’ వంటి ఘటనకు దారితీస్తుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: వ‌రుస ప్ర‌మాదాలు.. ట్రావెల్స్ బ‌స్సుల్లో ఏపీ పోలీస్ భ‌ద్ర‌తా చ‌ర్య‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>