దేశమంతా మనతోనే.. ఒక్క దిక్కుమాలిన వైసీపీ తప్ప: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: గత వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరుతో మూడుముక్కలాట ఆడిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా యాడికి ప్రజావేదిక సభకు సోమవారం సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధత విషయంలో దేశం అంతా మనతో నిలబడ్డారని.. ఒక్క దిక్కుమాలిన వైసీపీ తప్ప అంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రం మీద పగ పట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని వైసీపీ (YSRCP) నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. అమరావతి అనడం ఇష్టంలేకనే వైసీపీ వాళ్ళు మావిగన్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఏపీ డెవలప్మెంట్ ప్లాన్‌ను సభలో సీఎం వెల్లడించారు.అమరావతి (Amaravati) ప్రజా రాజధాని అని.. పురాణాల్లో దేవతల రాజధాని అని అభివర్ణించారు. నిన్నటిదాకా రాజధాని లేదని.. ఇప్పటినుంచి అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు.

రాయలసీమలో 20వేల చెరువులు నింపాము..

గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన నీరు-ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి వంటి వినూత్న పథకాల వల్ల ఇవాళ ఏపీ మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ సాగు) రంగంలో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. వర్షపు నీటి విలువ తెలిసిన రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మైక్రో ఇరిగేషన్ ఒక వరంగా మారిందని చెప్పారు. మైక్రో, డ్రిప్‌ ఇరిగేషన్‌ తెచ్చామని.. రాయితీతో పరికరాలు ఇచ్చామన్నారు. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని వివరించారు. రాయలసీమలో 63 శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్‌ ఇచ్చామన్నారు. హార్టికల్చర్‌కు వచ్చే ఆరేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. రాయలసీమలో 20వేల చెరువులు నింపామని వ్యాఖ్యానించారు.

అనంతపురాన్ని సంపన్న జిల్లాగా మారుస్తాం..

సీఎం మాట్లాడుతూ.. ‘అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చాం. వెలిగొండను ఈ ఏడాది పూర్తిచేస్తాం. వెలిగొండ ద్వారా ఈ ఏడాదే నీళ్లు వదులుతాం. అనంతపురం జిల్లాలో వాగులు, చెరువులను అనుసంధానం చేసే బాధ్యత కలెక్టర్‌దే. ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశాం. కృష్ణా నది నుంచి గతేడాది 1,500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. వృథాగా పోయే నీటిలో 300 టీఎంసీలు మళ్లిస్తే సమస్య ఉండదు. నదుల అనుసంధానం జరిగే దేశంలో సంపదకు కొరత ఉండదు. పట్టిసీమతో నీళ్లు లిఫ్ట్‌ చేసి కృష్ణా డెల్టాకు మల్లిస్తాం. కరువు జిల్లాగా ఉన్న అనంతపురాన్ని సంపన్న జిల్లాగా మారుస్తాం’ అని హామీ ఇచ్చారు.

Read Also: చెన్నైలో టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>