పోలీస్ స్టేషన్లలో ఆధునీక వసతులు : కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో : జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం (Karimnagar CP Ghaush Alam) హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో శుక్రవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని” ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.

నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. తగిన వసతి సౌకర్యాలు ఉన్నప్పుడే అధికారులు అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవ చేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని సీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, స్థానిక ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి లతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>