Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీలంక క్రికెట్ బోర్డులో భారీ కుదుపు.. షమ్మీ సిల్వా రాజీనామా!

కలం, వెబ్ డెస్క్: శ్రీలంక (Sri Lanka) క్రికెట్‌లో భారీ కుదుపులు సంభవించాయి. మూకుమ్మడి రాజీనామాలతో ఆ దేశ క్రికెట్ బోర్డ్ సతమతమవుతోంది. బోర్డ్ అధ్యక్షుడు షమ్మి సిల్వా (Shammi Silva) సహా ఒకేసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా తమ పదవుల నుంచి తప్పుకోవడంతో బోర్డ్ పరిస్థితి ప్రస్తతుం అగమ్యగోచారంగా మారింది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డ్ అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో క్రికెట్ బోర్డు తలకిందులవుతోంది. ఈ పరిస్థితుల్లో బోర్డ్‌ను తాత్కాలికంగా తామే నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివి కమిటీ ఏర్పాటయ్యే వరకు బోర్డ్‌కు సంబంధించి అన్ని నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకోనుంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంక క్రికెట్ బోర్డ్ విధులను ఆ దేశ క్రీడారంగ శాఖ మంత్రి తీసుకోనున్నట్లు సదరు మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది.

బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు, షమ్మీ సిల్వా రాజీనామాను ధ్రువీకరించింది. ఆయనతో పాటు ఆఫీస్ బేరర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కూడా పదవుల నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. వీరందరూ తమ రాజీనామా లేఖలను అధ్యక్షుడు అనూర కుమార దిస్సానాయకే, క్రీడల మంత్రి సునీల్ కుమార గమగేలకు పంపారు. బోర్డుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, జట్టు వైఫల్యాల వల్ల విమర్శలు వెల్లువెత్తాయి. గ్యారీ కిర్‌స్టన్ వంటి దిగ్గజ కోచ్‌లను నియమించినా ఫలితం లేకపోవడంతో మార్పు కోరుతూ ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, బోర్డును తన పరిధిలోకి తీసుకుంది. త్వరలోనే ఒక కొత్త కమిటీని నియమించి, క్రికెట్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది.

అసలెవరీ షమ్మీ సిల్వా

షమ్మీ సిల్వా 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగు సార్లు ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. ఆయన హయాంలో శ్రీలంక పురుషుల, మహిళల జట్లు ఆసియా కప్‌లను గెలుచుకున్నాయి. అయితే, ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రం జట్టు ఘోరంగా విఫలమైంది. 2023 వన్డే వరల్డ్ కప్, 2024, 2026 టీ20 వరల్డ్ కప్‌లలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. దీనికి తోడు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లోనూ జట్టు వెనుకబడిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>