కలం, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న AA23 మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ స్టార్స్ నటించనున్నారనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. AA23 మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తోందట. ఈ చిత్ర కథ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో కాజోల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో దీపిక పదుకోన్ హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.
ప్రస్తుతం AA23 మూవీ రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్, పలు హాలీవుడ్ స్టూడియోస్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ కనిపిస్తారట. పలు డిఫరెంట్ గెటప్స్ లో అల్లు అర్జున్ పర్ ఫార్మెన్స్ ను ప్రేక్షకులు ఈ చిత్రంలో చూడబోతున్నారు.
ఈ సినిమా కోసం సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వెచ్చిస్తోంది. సైన్స్ ఫిక్షన్ తో పాటు టైమ్ ట్రావెల్ వంటి అంశాలతో ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేలా తెరపై ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలో పలు గెస్ట్ రోల్స్ ఉంటాయని, వాటి కోసం దర్శకుడు అట్లీ స్టార్స్ ను అప్రోచ్ అవుతున్నాడని సమాచారం. వచ్చే ఏడాది AA23 మూవీ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


