epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ఫ్లాప్‌ టైటిల్ విశాల్‌కు సక్సెస్ ఇచ్చేనా..?

క‌లం, వెబ్ డెస్క్: తమిళ హీరో విశాల్ సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తుంటారు. ఆయన ప్రతి సినిమా తమిళంతో పాటు ఖచ్చితంగా తెలుగులో డబ్బింగ్ రూపంలో వస్తుంటుంది. ఆయనకు హిట్ ఇచ్చిన పందెం కోడి సినిమా నుంచీ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల అనారోగ్య కారణాలతో చిన్న గ్యాప్ తీసుకున్న విశాల్…ఇప్పుడు మొగుడు(Mogudu) టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

తమన్నా(Tamannaah) హీరోయిన్ గా నటిస్తున్న మొగుడు సినిమాలో యోగి బాబు ఓ కీ రోల్ చేస్తున్నారు. సుందర్. సి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ భార్యను సంతోషపెడుతూనే మరోవైపు విలన్స్ తో వైలెంట్ యాక్షన్ చేసే మొగుడిగా విశాల్(Vishal) ఆకట్టుకున్నారు. భర్తతో ఇంట్లో పనులన్నీ చేయించుకుంటూ టీవీ సీరియల్స్ చూసే భార్యగా తమన్నా కనిపించింది. సీరియల్ హీరోగా యోగిబాబు నవ్వించారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న మొగుడు సినిమా త్వరలో రిలీజ్ కు రానుంది. ఈ టైటిల్‌తో గతంలో గోపీచంద్ హీరోగా డైరెక్టర్ కృష్ణవంశీ ఓ సినిమాను రూపొందించారు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి ఫ్లాప్ టైటిల్ ను తన సినిమాకు విశాల్ ధైర్యంగా పెట్టుకున్నారు. యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మొగుడు సినిమా ఉండబోతోంది. మరి.. ఫ్లాప్ టైటిల్ గోపీచంద్ కి సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>