epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

కాంగ్రెస్​ మీటింగ్​కు BRS ఎమ్మెల్యే.. జీవన్​ రెడ్డి వాకౌట్​

కలం, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​ సీనియర్​ నేత, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి (Jeevan Reddy) అలిగారు. కాంగ్రెస్​ సమావేశంలో బీఆర్ఎస్​ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెడతారంటూ అర్దాంతరంగా వెళ్లిపోయారు. బుధవారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్​ పరిధిలో మున్సిపల్​ ఎన్నికలకు సమాయత్తం, ప్రణాళికలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జీవన్​ రెడ్డి.. అక్కడ జగిత్యాల బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ను చూసి షాకయ్యారు. వెంటనే సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్​ సమావేశంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేను ఎలా కూర్చోబెడతారంటూ జీవన్​ రెడ్డి (Jeevan Reddy) ప్రశ్నించారు. సంజయ్​ తాను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేనని స్పీకర్​ దగ్గర చెప్పుకున్నారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్​ సమావేశంలోకి అనుమతించారని అన్నారు. బీఆర్​ఎస్​ నుంచి వచ్చిన ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని మున్సిపల్​ ఎన్నికల గురించి ఎలా చర్చిస్తామని ప్రశ్నించారు. ‘రాజ్యాంగ ఉల్లంఘన చేసి వచ్చిన వ్యక్తి పక్కన మమ్మల్ని కూర్చోబెడితే మాకు గౌరవం ఎలా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. రాహుల్​ గాంధీ విధానాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఈ విషయం గురించి పీసీసీ చీఫ్​ను అడిగినా స్పందన రాలేదని చెప్పారు. ప్రజాపాలన వల్ల మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ వందశాతం గెలుస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా జీవన్​ రెడ్డి అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>