కలం, సినిమా : సస్పెన్స్ థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్‌తో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా డెకాయిట్ (Dacoit). ఈ చిత్రంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుంది. ఓ దొంగ జంట కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దాంతో హీరో అడివి శేష్, ఇతర టీమ్ మెంబర్స్ మృణాల్‌కు సెండాఫ్ ఇచ్చారు. తనతో టీమ్ అంతా పిక్స్ తీసుకున్నారు.
మొదట ఈ క్యారెక్టర్‌లో శ్రుతి హాసన్ (Shruti Haasan) నటించింది. ఆమెతో కొంత షూటింగ్ చేశాక డేట్స్ క్లాష్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రుతి హాసన్ క్యారెక్టర్‌లో మృణాల్‌ను తీసుకున్నారు. ఆమె కూడా ఈ క్యారెక్టర్‌కు పర్పెక్ట్ గా కుదిరింది. స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంటే తన క్యారెక్టర్ వరకు మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది. సీతారామం, ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న వంటి సినిమాల్లోనూ ఇది ప్రూవ్ అయ్యింది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్ సినిమా మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన డెకాయిట్ టీజర్‌తో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.


