epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఫారిన్ సరుకు ఇక చౌక!

కలం, తెలంగాణ బ్యూరో: ఫారిన్ మందు (Foreign Liquor) కోసం ఎదురుచూసే మద్యం ప్రియులకు గుడ్ న్యూస్! త్వరలో విదేశీ మద్యం రేట్లు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా యూరప్ నుంచి దిగుమతి అయ్యే వైన్, విస్కీ, వోడ్కా, బీర్ రేట్లు సగం వరకు దిగిరానున్నాయి. ఈయూతో మన దేశానికి కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) వల్ల ఈ ఊరట లభించనుంది.

వైన్ రేట్లు ఇలా..

యూరిపియన్ యూనియన్ లోని 27 దేశాల నుంచి మనదేశానికి పలు రకాల వైన్ బ్రాండ్లు దిగుమతి అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ నుంచి వచ్చే వాటికి మంచి డిమాండ్ ఉంది. వీటిలో ఫ్రాన్స్ నుంచి వచ్చే బోర్డియాక్స్/బోర్డో (Bordeaux), షాంపైన్ (Champagne), బుర్గండి (Burgundy) వంటి వైన్ బ్రాండ్లు… ఇటలీ నుంచి వచ్చే చియాంటి (Chianti), ప్రొసెక్కో (Prosecco) వంటి వైన్ బ్రాండ్లు.. స్పెయిన్ నుంచి వచ్చే రియోజ (Rioja) వంటి వైన్ బ్రాండ్లు ఫేమస్. ప్రస్తుతం వీటిపై 150శాతం దిగుమతి సుంకం అమలవుతుండగా.. ట్రేడ్ డీల్ ప్రకారం అది 30 నుంచి 20 శాతానికి తగ్గుతంది. ఆ మేరకు రేట్లు కూడా దిగి వస్తాయి. అంటే, ఐదారువేల రూపాయలకు దొరికి ఒక బ్రాండ్.. రెండు వేలకే లభిస్తుంది.

విస్కీ రేట్లు ఇలా..

మన దగ్గర స్కాట్లాండ్ నుంచి వచ్చే విస్కీ చాలా ఫేమస్. అయితే.. ఈయూ దేశాల నుంచి కూడా ప్రముఖ బ్రాండ్లు దిగుమతి అవుతుంటాయి. ఐర్లాండ్ నుంచి జేమ్సన్ (Jameson) .. ఫ్రాన్స్ నుంచి హెన్నేసీ (Hennessy), రెమీ మార్టిన్ (Remy Martin), కోర్వోవిసియర్ (Courvoisier) వంటి విస్కీ బ్రాండ్లు.. స్వీడన్ నుంచి అబ్జల్యూట్ (Absolut), పోలాండ్ నుంచి బెల్వేడర్ (Belvedere) వంటి ప్రీమియం వోడ్కా మన దేశానికి దిగుమతి అవుతుంటుంది. వీటిపైన ప్రస్తుతం 150 శాతం ఉన్న దిగుమతి సుంకం 40 శాతానికి దిగిరానుంది.

బీర్ రేట్లు ఇలా..

మన దగ్గర జర్మనీ, బెల్జియం బీర్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం వీటిపై ఇంపోర్ట్ డ్యూటీ 110 శాతం ఉండగా.. తాజా ట్రేడ్ డీల్ తో అది 50శాతానికి చేరనుంది. ఆ మేరకు ధరలు కూడా తగ్గుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడే కాదు..

ఈయూతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదిరింది కదా అనీ.. ఆ దేశాల నుంచి వచ్చే ఫారిన్ సరుకు (Foreign Liquor) రేట్లు ఇప్పుడే తగ్గవు. టైమ్ పడ్తుంది. అంతా సెట్ అయ్యే వరకు కనీసం ఏడాది పట్టొచ్చు. ఈయూలోని 27 దేశాలు కూడా డీల్ కు ఓకే చెప్పాల్సి ఉంది. అందుకే అంత టైమ్ పడ్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: స్మార్ట్ స్పెండింగ్‌కు బెస్ట్ క్రెడిట్ కార్డులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>