కలం, వెబ్ డెస్క్: ఇప్పటి క్రెడిట్ కార్డులు (Credit Card Offers) లగ్జరీ ప్రయోజనాలకే పరిమితం కావడం లేదు. కిరాణా కొనుగోళ్లు, కరెంట్ బిల్లు, ఇంధన ఖర్చులు, ఆన్‌లైన్ పేమెంట్లు లాంటి నిత్య అవసరాలపై నేరుగా లాభం ఇచ్చేలా మారాయి. తెలివిగా ఉపయోగిస్తే ప్రతి నెలా మంచి సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ట్రెండ్ మారుతోంది
ఒకప్పుడు ఎయిర్‌పోర్ట్ లౌంజ్ యాక్సెస్ కోసం కార్డులు తీసుకునేవారు. ఇప్పుడు వినియోగదారుల ఆలోచన మారింది. నెలవారీ ఖర్చుల్లో ఎంత రిటర్న్ వస్తోంది అన్నదే ప్రధానంగా చూస్తున్నారు. అదనపు ఛార్జీలు లేకుండా స్థిరమైన క్యాష్‌బ్యాక్ (Cash Back) ఇచ్చే కార్డులకే ప్రాధాన్యం పెరుగుతోంది.
ఫెడరల్ బ్యాంక్ స్కాపియా రుపే కార్డు
ఈ కార్డు జీవితకాలం ఫ్రీగా లభిస్తుంది. జాయినింగ్ ఫీజు అవసరం లేదు. వార్షిక ఛార్జీలు ఉండవు. స్కాపియా యాప్ ద్వారా చేసే ట్రావెల్ బుకింగ్స్‌పై వేగంగా రివార్డ్స్ వస్తాయి. ఇతర అర్హమైన ఖర్చులపై కూడా పాయింట్లు లభిస్తాయి.
ఫోన్‌పే హెచ్‌డీఎఫ్‌సీ అల్టిమో కార్డు
ఫోన్‌పే యాప్‌లో చేసే రీచార్జ్‌లు, యుటిలిటీ పేమెంట్లు, ట్రావెల్ బుకింగ్స్‌పై గరిష్టంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎంపిక చేసిన ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలపై 5 శాతం వరకు రిటర్న్ ఉంటుంది. స్కాన్ పే ద్వారా చేసే చెల్లింపులపై 1 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ సూపర్‌మనీ రుపే కార్డు
సూపర్‌మనీ యాప్ ద్వారా చేసే UPI పేమెంట్లపై ఈ కార్డు గరిష్టంగా 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ (Credit Card Offers) ఇస్తుంది. రివార్డ్స్ నేరుగా కార్డు ఖాతాలో జమ అవుతాయి. ఇంధన ఖర్చులపై సర్‌చార్జ్ మినహాయింపు ఉండటం వల్ల రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగకరంగా మారింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ కార్డు
ఈ కార్డు అర్హమైన రిటైల్ ఖర్చులపై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. వార్షిక ఖర్చుల లక్ష్యాలను చేరుకుంటే అదనపు బోనస్ పాయింట్లు లభిస్తాయి. దేశీయ ఎయిర్‌పోర్ట్ లౌంజ్ సదుపాయం, రైల్వే లౌంజ్ యాక్సెస్, మూవీ టికెట్ డిస్కౌంట్లు దీని ప్రత్యేకత.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ UPI క్రెడిట్ కార్డు
ఈ కార్డు డిజిటల్ చెల్లింపులపై ఎక్కువ దృష్టి పెట్టింది. సేవింగ్స్ ఖాతా కాకుండా నేరుగా క్రెడిట్ ఖాతా నుంచి UPI పేమెంట్లు చేయవచ్చు. కిరాణా ఖర్చులు, డైనింగ్ పేమెంట్లపై గరిష్టంగా 3 శాతం వరకు క్యాష్ పాయింట్లు లభిస్తాయి. యుటిలిటీ బిల్లులపై 2 శాతం రిటర్న్ ఉంటుంది. ప్రతిరోజూ చేసే చిన్న ఖర్చులే పెద్ద సేవింగ్స్‌గా మారేలా ఈ క్రెడిట్ కార్డులు రూపొందించబడ్డాయి. ఖర్చుల అలవాట్లకు సరిపోయే కార్డును ఎంచుకుంటే, అదనపు భారంలేకుండా ప్రతి నెలా లాభం పొందే అవకాశం ఉంటుంది.
Read Also: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. ఫారిన్ సరుకు ఇక చౌక!
Follow Us On: X(Twitter)


