కలం, వెబ్ డెస్క్ : భారత్ తో అమెరికాది చరిత్రాత్మక బంధం అని చెప్పారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). 77వ రిపబ్లిక్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో తాను ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా భారత్ తో అమెరికాకు దశాబ్దాల నాటి సంబంధం ఉందన్నారు. అమెరికా తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు రిపబ్లిక్ డే సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పారు. ట్రంప్ ట్వీట్ లో ఇండియాతో అమెరికా బంధాన్ని ప్రత్యేకంగా చెప్పడంపై చర్చ జరుగుతోంది. ఓ వైపు టారిఫ్ లు తగ్గిస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఈ క్రమంలోనే ట్రంప్ భారత్ తో బంధాన్ని గుర్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.


