epaper
Monday, January 26, 2026
spot_img
epaper

ఐఏఎస్ టాపర్.. సెల్యూట్‌లో ఫాల్ట్… కలెక్టర్ తీరు వివాదాస్పదం

కలం, తెలంగాణ బ్యూరో: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేసే సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తుంటారు. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేయడంలాంటివి అందులో భాగమే. కానీ ఈసారి రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో కాంట్రొవర్సీగా మారింది. నెటిజెన్లు అనేక రకాల కామెంట్లు చేయడానికి దారితీసింది. దేశవ్యాప్తంగానే 2015 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఐఏఎస్ నేషనల్ టాపర్‌ అయిన టీనా డబీ (IAS Tina) రెండేండ్ల నుంచి బార్మర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జెండాను ఎగురవేసిన తర్వాత గౌరవ వందనం స్వీకరించే సమయంలో అటు జాతీయ జెండావైపుగానీ, ఇటు హాజరైన జనంవైపుగానీ చూసి సెల్యూట్ చేయడానికి బదులు కెమెరా ఉన్నవైపు ఫోకస్ పెట్టడం వివాదానికి దారితీసింది.

గౌరవ వందనం ఎలా చేయాలో తెలియదా ? :

ఐఏఎస్ ట్రెయినింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2017లో ఫస్ట్ టైమ్ అజ్మీర్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్‌గా మూడేండ్లపాటు, ఆ తర్వాత మరో మూడేండ్ల పాటు జైపూర్ జాయింట్ కలెక్టర్‌గా, ఒక ఏడాది పాటు జైసల్మేర్ కలెక్టర్‌గా పనిచేసినా గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత గౌరవవందనం సమయంలో ఎలా వ్యవహరించాలో తెలియదా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుతం బర్మార్ జిల్లా కలెక్టర్‌గా 2024 నుంచీ పనిచేస్తున్నా ఇప్పటికీ అవగాహన లేకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఐఈఎస్ (ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్) అధికారులు. ఆమె సోదరి కూడా ఐఏఎస్ ఆఫీసరే. టీనా దబి (IAS Tina) 2015 ఐఏఎస్ నేషనల్ టాపర్. శిక్షణ తర్వాత రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. నీటి వనరుల సమర్ధ వినియోగంలోనూ ఆమె రాష్ట్రపతి నుంచి గతేడాది ప్రశంసలు, అవార్డు అందుకున్నారు. కానీ జాతీయ పతాకావిష్కరణ, గౌరవ వందనం సమయంలో ఆమె వ్యవహరించిన తీరే వివాదానికి కారణమైంది. గతేడాది సైతం రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీష్ పునియా దగ్గర ఐఏఎస్ అధికారి స్థాయిని తగ్గించుకుని తల వంచి వ్యవహరించిన తీరు అప్పట్లోనూ చర్చనీయాంశమైంది.

Read Also: ఆ రోజులు మరపురానివి.. పరేడ్ ఫొటోలు షేర్ చేసిన కిరణ్ బేడీ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>