epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

గ్లోబల్ ఎకనామిక్ పవర్ హబ్ గా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు

కలం, వెబ్​ డెస్క్​ : గ్లోబల్​ ఎకనామిక్​ పవర్​ హబ్​ గా హైదరాబాద్​ ఎదుగుతోందని మంత్రి శ్రీధర్​ బాబు (Minister Sridhar Babu) తెలిపారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తలపెట్టిన సమావేశం పాల్గొని.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ (Telangana Vision Document) ను ఆవిష్కరణ చేశామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ కు ఎక్కువ పెట్టుబడులు పెడతామన్నారు. సదస్సులో రెండు ప్రధాన పాలసీ నిర్ణయాలు జరిగాయని.. ఆర్టిఫిషియల్ హబ్ ఏర్పాటు, ఫార్మా కు సంబంధించి లైఫ్ సైన్స్ కు సంబంధించిన అగ్రిమెంట్ జరిగినట్లు వెల్లడించారు.

వరల్డ్ ఎకానమిక్​ ఫోరం సదస్సు (WEF Summit) వేళ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. జాతీయ సగటు కన్నా తెలంగాణ ధరలు నియంత్రణ లో ఉన్నాయని ఎకనామిక్ సర్వే 2025-26 లో వెల్లడించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫలేషన్ కు సంబంధించి తెలంగాణకు రేటింగ్ ఇచ్చిందన్నారు. తెలంగాణ కేంద్రం ఇచ్చే నిధుల మీద ఆధారపడి లేదని.. సొంత నిధులతో ఆర్థికంగా బలంగా ఉన్నామని తెలిపారు. వార్షిక ప్రగతి రేటు లో 12.6 శాతం సాధించామన్నారు. గత సంవత్సరాల కంటే ఎక్కువగా కేంద్రం నిధులు ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు.

‘వ్యవసాయ శాఖలో సాంకేతిక పరిజ్ఞానం ను ప్రవేశపెట్టాం. ప్రతి రంగంలో టెక్నాలజీ ని ఉపయోగిస్తున్నాం. రైతులకు సంబంధించిన డిజిటల్ టెక్నాలజీ ని ఉపయోగించుకొని ట్రాకింగ్ సిస్టమ్ ను పెట్టాం. రెవెన్యూ వ్యవస్థను భూ భారతితో టెక్నాలజీ తో ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రియల్, మ్యాన్​ ఫ్యాక్చర్, కమర్షియల్ రంగాలలో అనేక నూతన సంస్కరణ లు తీసుకొస్తున్నాం. 40 శాతం దేశానికి సంబంధించిన సేవలు రాష్ట్రం నుంచే అందిస్తున్నాం. హైదరాబాద్ సిటీ జీడీపీ 2035లో 20.4 బిలియన్స్ ఉంటాయని సర్వేలు చెబుతున్నాయి. పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్ హబ్ లా తయారవుతుంది. టాప్ 8 సిటీస్ లో హైదరాబాద్ ఉందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు పెంచే ప్రక్రియ చేపడుతున్నాం. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఎకనామిక్ సర్వే వారి దుష్ప్రచారాల కు తెర తీసింది. తెలంగాణ ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడమే మా లక్ష్యం. తెలంగాణ రైజింగ్ లో ప్రతి ఒక్కరు సహకరించాలి’ అని మంత్రి శ్రీధర్​ బాబు (Minister Sridhar Babu) తెలిపారు.

Read Also: స్వర మాంత్రికుడి విషాద గాథ.. అర్జిత్ సింగ్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ మీకు తెలుసా!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>