కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే. ఇందులో వివిధ దేశాలకు 62 మంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ హార్వర్డ్ అధ్యాపకులచే సర్టిఫికెట్ పొంది అరుదైన ఘనత సాధించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (Harvard Kennedy School) మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియం కార్యక్రమంలో ప్రసంగించాలని రేవంత్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు.
ఈ సింపోజియంలో ప్రసంగించనున్న తొలి భారతీయ నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించనున్నారు. మార్చిలో జరగనున్న ఈ కార్యక్రమంలో గ్లోబల్ నాయకులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. ఏఐ (AI) మౌలిక సదుపాయాలు, విధానాల ఫ్రేమ్‌వర్క్‌లపై దృష్టి సారించే ఉన్నత స్థాయి ప్యానెల్ కీలక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.


