కలం, వెబ్ డెస్క్ : మేడారంలో (Medaram) పెను ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని హరిత వై-జంక్షన్ సమీపంలో శుక్రవారం ఒక భారీ స్క్రీన్ హోర్డింగ్ (Hoarding) అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు.
మేడారం (Medaram) జంపన్నవాగు నుంచి గద్దెల వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న హరిత హోటల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులకు సమాచారం అందించేందుకు కొద్ది రోజుల క్రితమే అధికారులు ఇక్కడ భారీ స్క్రీన్ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే, అది ఒక్కసారిగా కింద పడటంతో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉండేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు జేసీబీ సహాయంతో కూలిన హోర్డింగ్‌ను (Hoarding) రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Read Also: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పనితీరు భేష్ : డీజీపీ శివధర్ రెడ్డి
Follow Us On: Sharechat


