కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్కూల్ బస్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ పిల్లలు గాయపడ్డారు. ఎస్ఆర్ పురం సమీపంలోని జీడీ నెల్లూరు వైపు వెళ్తుండగా బీసీ కాలనీ వద్ద స్కూలు బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులకు తీవ్ర గాయాలు కాగా, ఒక విద్యార్ధికి ఏకంగా నాలుక తెగిపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బస్సులో గాయపడిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: సత్యం తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా.. ఎప్పటికీ ఓడదు : వైఎస్ జగన్
Follow Us On: Sharechat


