కలం, వెబ్ డెస్క్ : నేడు జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) 78వ వర్ధంతి సందర్భంగా ప్రముఖులంతా ఆ మహాత్ముడికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నా అని జగన్ ట్వీట్ చేశారు.


