కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)లో భారీగా నగదు పట్టుబడటం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవల విడుదలైన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కాబట్టి రూ.50 వేలకు మించి నగదు తరలించరాదు. ఒక వేళ అంతకుమించి నగదు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే, సరైన ఆధారాలు చూపించాలి. లేదంటే అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకుంటారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనిఖీలు చేస్తున్న అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రగుడు చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారులో రూ. 20 లక్షల నగదు గుర్తించారు. కారులో ఉన్న వారిని నగదుకు సంబంధించిన వివరాలు అడిగారు. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు.
Read Also: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు
Follow Us On: Pinterest


