కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే తనకు, కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇస్తున్నదని ఆయన ఆరోపించారు. ఎన్ని నోటీసులిచ్చినా మీ వెంట పడుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గుకుంభకోణం బయటపడకుండా ఉండేందుకే ఈ నోటీసుల డ్రామా అని ఆయన ఆరోపించారు. అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Read Also: ‘తెలంగాణ ఫస్ట్..’ నినాదం వెనుక.. మర్మమేమిటి?
Follow Us On: Sharechat


