కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నేతృత్వంలోని ‘మక్కళ్ నీది మయ్యం’ (MNM) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (EC) మళ్లీ టార్చిలైట్ గుర్తును కేటాయించింది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుతోనే కమల్ పార్టీ బరిలోకి దిగనుంది. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మక్కళ్ నీది మయ్యం పార్టీకి ఇదే గుర్తు లభించింది. ఇప్పుడు మరోసారి అదే గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి విజిల్ గుర్తు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కమల్ (Kamal Haasan) పార్టీకి కూడా గుర్తు ఖరారు కావడంతో తమిళనాట ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. ఇద్దరు అగ్ర హీరోల పార్టీలకు గుర్తులు ఖరారు కావడంతో అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
Read Also: టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు
Follow Us On : WhatsApp


