కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక మెమో జారీ చేసింది. ఇక నుంచి తెలంగాణలో అక్రిడిటేషన్ కార్డులు (Accreditation) ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై Press అనే పదం వాడాలని తెలిపింది. సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం 1989 ప్రకారం అనధికారికంగా వాహనాలపై లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై Press అనే పదం ఎవరు పడితే వారు వాడటానికి వీల్లేదని మెమోలో తెలిపారు సమాచార శాఖ కమిషనర్. ఈ మేరకు అందరు డీపీఆర్ వోలు వారి జిల్లా పరిధిలో ఈ నిబంధన అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అక్రిడిటేషన్ కార్డులు (Accreditation) లేని వారు Press అనే లోగో తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతం అక్రిడిటేషన్లు లేకపోయినా మీడియా సంస్థల ఐడీ కార్డులు ఉన్న వారు కూడా వాహనాలపై Press అనే పదం వాడుకుంటున్న సంగతి తెలిసిందే.


