కలం, వెబ్ డెస్క్: భారత గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌తో పాటు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో గవర్నర్ ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. జెండావిష్కరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్స అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో గవర్నర్ తన గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ప్రజలకు అందించనున్నారు.
Read Also: పార్టీ మారిన స్థానాల్లో మళ్లీ ఎన్నికలు పెట్టండి : కేటీఆర్
Follow Us On: Pinterest


