Mobile Popup Ad
Mobile Popup Ad

పుట్టా మహేశ్ కుమార్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ ఆరా!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన మొయినాబాద్ డ్ర‌గ్స్ కేసుపై ఏపీ ఇంటెలిజెన్స్ (AP Intelligence) దృష్టి సారించింది. స‌ద‌రు డ్ర‌గ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేశ్ కుమార్ (Putta Mahesh Kumar) కూడా ఉండ‌టం, ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పుట్టా మ‌హేశ్‌ను టీడీపీ నుంచి స‌స్పెండ్ చేయాలని, ఆయ‌నను ఎంపీ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని వైసీపీ నుంచి డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. పైల‌ట్ రోహిత్ రెడ్డికి, పుట్టా మ‌హేశ్‌కు ఉన్న సంబంధాల‌పై ఆరా తీసింది. ఇటీవ‌ల పుట్టా మ‌హేశ్ సిమ్లా వెళ్లిన‌ట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ మేర‌కు ఇంటెలిజెన్స్ రూపొందించిన ఓ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>