కలం, వెబ్ డెస్క్ : ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో గాయపడ్డ దుర్గ (28) ఆదివారం మృతి చెందారు. గుంటూరు (Guntur) జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన మల్లేష్ (30) తో దుర్గకి వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కోపం పెంచుకున్న దుర్గ శనివారం ప్రియుడి ఇంటికి వచ్చి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పెట్టి నిప్పు పెట్టింది.
ఈ క్రమంలో ఆమెపై పెట్రోల్ పడడంతో మంటలు అంటుకున్నాయి. తీవ్రగాయాల పాలవడంతో దుర్గతో పాటు మల్లేశ్ కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. దుర్గ పరిస్థితి విషమించడంతో గుంటూరు (Guntur) ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయారు.


