కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్ర అజిత్ పవార్‌కు (Sunetra Pawar) కేటాయించిన శాఖలకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ (Governor Acharya Devvrat) ఆమోదం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అధికారిక లేఖ ద్వారా గవర్నర్ తన సమ్మతిని తెలియజేశారు.
ముఖ్యమంత్రి సిఫారసు మేరకు సునేత్ర అజిత్ పవార్‌కు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి శాఖలను కేటాయించినట్లు గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదించిన శాఖల కేటాయింపులకు తన ఆమోదం తెలిపినట్లు గవర్నర్ తెలియజేశారు. గవర్నర్ ఆమోదంతో డిప్యూటీ సీఎం సునేత్ర అజిత్ పవార్‌కు శాఖల కేటాయింపు ప్రక్రియ అధికారికంగా పూర్తైంది.
Read Also: మీ తాత, తండ్రి పేరుమీదున్న ఎఫ్డీలను ఇలా చెక్ చేయండి..
Follow Us On: Pinterest


