కలం, డెస్క్ : ఏపీలో అరాచక పాలన సాగుతోందని మాజీ సీఎం వైెస్ జగన్ (YS Jagan) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రం జంగిల్ రాజ్ గా మారిపోయిందంటూ విమర్శలు గుప్పించారు మాజీ సీఎం జగన్. ‘ఏపీలో ప్రశ్నిస్తే ఇలాంటి కేసులు, దాడులతో వేధిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. ఇలాంటి దాడులు మాకు కొత్త కాదు. అంబటి రాంబాబు ప్రశ్నిస్తుంటే రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులు చేయిస్తున్నారు టీడీపీ నేతలు’ అంటూ విమర్శలు గుప్పించారు మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే వైసీపీ నేతలపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని.. కేంద్ర హోంశాఖ వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జగన్. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు వైసీపీ అధినేత.


