కలం, వెబ్ డెస్క్ : 77వ రిపబ్లిక్ డే వేడుకలు (Republic Day) దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) లో తొలిసారిగా గణతంత్ర వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాయపూడిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazeer) జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనస్వాతం పలికారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన పరేడ్ గవర్నర్ 11 దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కాగా, రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహిస్తున్న రిపబ్లిక్ వేడుకలకు అమరావతి రైతులకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. రైతులకు, విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన 22 ఎకరాల్లో కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 13వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.


