కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు (Gold Silver Prices) మళ్లీ పెరిగాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం 5400 పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం 1,59,710 రూపాయలు పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,950 పెరిగి 1,41,450కి చేరుకున్నది. ధరలు హెచ్చుతగ్గులు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. త్వరలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం కొనుగోలు చేయాలని భావించిన వారికి ఏమీ అర్థంకాకుండా ఉంది.
ఇక వెండి ధర (Gold Silver Prices) అదే స్థాయిలో పెరుగుతోంది. ఇవాళ కిలో వెండి ధర 20 వేల రూపాయలు పెరిగి 3,60, 000లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో వెండికి విపరీతంగా డిమాండ్ ఉండటం, చైనా వెండి ఎగుమతిని ఆపేయడం ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరి కొన్ని నెలల్లోనే కిలో వెండి రూ. 4 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: అనిల్ రావిపూడి.. ఊహించని హీరోతో ఫిక్స్ అయ్యాడా..?
Follow Us On: X(Twitter)


