కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం కేసులో (Liquor Case) వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ గురువారం విచారించింది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మిథున్ రెడ్డి సూచనల మేరకే తాను రూ.100 కోట్లు సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విచారణలో సాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి విచారణలో ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు.. సామూహిక అక్షరాభ్యాసాలు
Follow Us On: Sharechat


