కలం, వెబ్ డెస్క్ : గోల్డ్ ధరలు (Gold Price) మళ్లీ షాక్ ఇచ్చాయి. గత వారం రోజులుగా కంటిన్యూగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేడు జనవరి 20న మంగళవారం కూడా పెరిగాయి. హైదరాబాద్ లో నేటి ధరలు చూసుకుంటే.. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.1040 పెరిగి రూ.1,47,280 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) మీద రూ.950 పెరిగి రూ.1,35,000 గా ఉంది. 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం మీద రూ.780 పెరిగి రూ.1,10,460గా ట్రేడ్ అవుతోంది.
అటు వెండి ధరలు బంగారాన్ని మించి పెరుగుతున్నాయి. కిలో వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.3,15,000కు చేరుకుంది. ఈ ఒక్క రోజే రూ.10వేలు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణాలు, అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటం వల్ల ఈ ధరలు ఇంకా పెరుగుతున్నట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.


