epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

ఇన్వెస్టర్లకు షాక్.. బేర్ మన్న స్టాక్ మార్కెట్లు!

కలం, డెస్క్ : ఇండియా స్టాక్ మార్కెట్లు (Stock Market) కుప్పకూలాయి. మంగళవారం నిఫ్టీ 50, సెన్సెక్స్ ఇండెక్స్ లు 1.5 శాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ (Sensex) వెయ్యి పాయింట్లు, నిఫ్టీ (Nifty 50) 360 పాయింట్లు పతనమ్యాయి. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల దాదాపు 9 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.  సోమ, మంగళవారం రెండు రోజుల్లో కలిపి సెన్సెక్స్ ఏకంగా 1500కుపైగా పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి.. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వేస్తున్న టారిఫ్ లు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక మార్కెట్ నుంచి చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. నిఫ్టీ 50 లోని కీలకమైన రిలయెన్స్ షేర్ 1.50 శాతం మేర పతనమైంది. కొత్త సంవత్సరం మొదటి నుంచి దేశీయ షేర్ మార్కెట్ లో ఇండెక్స్ లు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. నెలరోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 4 శాతం అంటే.. 3వేలకు పైగా పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 50 కూడా ఇదే స్థాయిలో కుప్పకూలింది.

పతనానికి కారణం

1. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) ఆడుతున్న ట్రేడ్ వార్. ప్రస్తుతం గ్రీన్ ల్యాండ్ స్వాధీనం కోసం యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్ వంటి దేశాలపై భారీగా టారిఫ్ (Tariff) విధిస్తానని చెప్పడం.
2. కంపెనీల క్యూ 3 రిజల్ట్స్ మిక్స్ డ్ గా వస్తుండటం.
3. వరుసగా ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ ఐఐ వెళ్లిపోతుండటం. కేవలం ఈ నెలలోనే ఫారెన్ ఇన్వెస్టర్లు రూ. 29వేల కోట్లకు పైగా స్టాక్స్ ను సెల్ చేయడం.
4. కేంద్ర బడ్జెట్ మార్కెట్ (Stock Market) కు అనుకూలంగా ఉండకపోవచ్చన్న అనుమానాలు.

Read Also: జాతీయగీతం తెచ్చిన తంటా.. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>