కలం, వెబ్ డెస్క్ : అల్లరి నరేష్ (Allari Naresh) ఇంట విషాదం చోటు చేసుకుంది. వృద్ధాప్య కారణాలతో ఇవివి సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజాము మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. 2019 May 27 న భార్య వెంకటరత్నం గారు మరణించారు. ఆయనకు 3 ముగ్గురు కుమారులు. ఒక కుమారై. పెద్దకుమారుడు E.V.V. సత్యనారాయణ. రెండో కుమారుడు E.V.V. గిరి. మూడో కుమారుడు E.V.V. శ్రీనివాస్. నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Read Also: ప్రభాస్ “సలార్ 2” బిగ్ అప్డేట్.. అప్పుడే?
Follow Us On : WhatsApp


