కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ తర్వాత అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ఫోకస్ పెరిగింది. ఇప్పుడు ఐపీఎల్ 2026 ముందు అతనికి పెద్ద పరీక్ష ఎదురవుతోందనే చర్చ మొదలైంది. మొదటగా మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ అభిషేక్ టాలెంట్‌ను హైలైట్ చేశారు. భయపెట్టే ప్రెజెన్స్ లేకపోయినా, బౌలర్లపై ఒత్తిడి పెంచే స్టైల్ అతనిలో ఉందని కొనియాడారు. యువరాజ్ సింగ్ మార్గదర్శకత్వం అతనికి సిక్సర్లలో దూకుడు ఇచ్చిందని చెప్పారు. అభిషేక్ బ్యాట్ ఫ్లో స్మూత్‌గా ఉండటం వల్ల రెండు వైపులా సులభంగా సిక్సర్లు కొడతాడని, ముఖ్యంగా ఆఫ్‌సైడ్‌లో బౌలర్లను టార్గెట్ చేయడం అతని బలం అని బాలాజీ వివరించారు.
మరోవైపు బద్రినాథ్ కీలక హెచ్చరికలు చేశారు. ఆఫ్‌స్పిన్ ఎదుట అభిషేక్ ఇటీవల ఇబ్బందులు పడుతున్నాడని, ఐపీఎల్ ముందు దీనిపై పని చేయాల్సిందేనని సూచించాడు. హై బ్యాక్‌లిఫ్ట్ అతనికి సిక్సర్లు అందిస్తున్నప్పటికీ, అదే సమయంలో కంట్రోల్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఫామ్ తప్పితే వరుస వైఫల్యాలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ట్రావిస్ హెడ్–అభిషేక్ శర్మ జోడీపై ఎస్. రమేశ్ భారీ కామెంట్స్ చేశారు. ఈ జోడీ పవర్‌ప్లేలో గేమ్‌ను పూర్తిగా మార్చేస్తుందని, వీరి ఆట చూసేందుకే ఫ్యాన్స్ టీవీ ఆన్ చేస్తున్నారని అన్నారు. 2024లో ఇదే జోడీ SRHను ఫైనల్‌కు చేర్చిందని గుర్తుచేసినట్లు సమాచారం. ఈసారి కూడా ఇద్దరూ క్లిక్ అయితే టాప్-4 ఖాయం అని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
అయితే అన్ని పిచ్‌లపై ఒకే విధంగా దూకుడు ప్రదర్శించడం ప్రమాదకరమని రమేశ్ హెచ్చరించారు. బ్యాటింగ్‌కు అనుకూలం కాని పిచ్‌లపై అదే స్ట్రాటజీ కొనసాగిస్తే స్కోర్లు కూలిపోతాయని పేర్కొన్నారు. మొత్తంగా, అభిషేక్ శర్మకు టాలెంట్ ఉన్నా, ఐపీఎల్ ముందు కీలక లోపాలను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఈ సీజన్ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

