Mobile Popup Ad
Mobile Popup Ad

రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్, భట్టి

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది (Ugadi) పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణల నడుమ రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ శ్రవణం ప్రారంభించారు. రవీంద్రభారతిలోనే మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ను సీఎం సన్మానించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>