కలం, డెస్క్ : బీఆర్ ఎస్ ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ (KCR) భేటీ ముగిసింది. ఫిబ్రవరి 1న రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, సంతోష్ రావులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. విచారణ నేపథ్యంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ఇతర విషయాలపై కేసీఆర్ (KCR) వారితో చర్చించారు. భేటీ అనంతరం నేతలందరూ హైదరాబాద్ బయలుదేరగా.. సంతోష్ రావు మాత్రం అక్కడే ఉండిపోయారు. రేపు ఉదయమే నందినగర్ లోని తన నివాసానికి కేసీఆర్ రాబోతున్నట్టు తెలుస్తోంది.


