Mobile Popup Ad
Mobile Popup Ad

అనుష్క పెళ్లి వార్తలు.. ప‌ర్స‌న‌ల్ టీం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

క‌లం, వెబ్ డెస్క్‌: నటి అనుష్క శెట్టి (Anushka Shetty) వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆమె పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్న వార్తలపై ఆమె పర్సనల్ టీమ్ స్పందించింది. కనీసం అధికారిక సమాచారం లేకుండా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోజూ హెడ్ లైన్స్‌గా మార్చడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది. నిజానిజాలు తెలుసుకోకుండా కేవలం ఊహాగానాలతో వార్తలు రాయడం జర్నలిజం అనిపించుకోదని, అది ఎదుటివారి ప్రైవసీలోకి చొరబడటమేనని టీమ్ స్పష్టం చేసింది. వార్తలకు, పుకార్లకు మధ్య ఉన్న గీతను మీడియా విస్మరిస్తోందని విచారం వ్యక్తం చేసింది.

ఈ ప్రచారంలో అనుష్క వయసును (44 ఏళ్లు) ప్రత్యేకంగా ప్రస్తావించడంపై టీమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి పోస్ట్‌లోనూ ఆమె వయసును హైలైట్ చేయడం అనేది ఒక రకమైన ‘ఏజ్ షేమింగ్’ అని, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొంది. ఇదే ఉత్సాహం మేల్ యాక్ట‌ర్స్ విషయంలో ఎందుకు కనిపించదని, కేవలం ఫీమేల్ యాక్ట‌ర్స్ విషయంలోనే ఇలాంటి వివక్ష ఎందుకని ప్రశ్నించింది. అనుష్క తన కెరీర్‌ను ఎంతో గౌరవప్రదంగా, ప్రతిభతో నిర్మించుకున్నారని, పబ్లిసిటీ స్టంట్స్, సోషల్ మీడియా హడావుడికి ఆమె ఎప్పుడూ దూరంగా ఉంటారని గుర్తు చేసింది.

పెళ్లి అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత విషయమని, అది బ్రేకింగ్ న్యూస్ లేదా ట్రెండింగ్ కోసం వాడుకునే అంశం కాదని అనుష్క టీమ్ స్పష్టం చేసింది. అనవసరపు సెన్సేషన్ కోసం బాధ్యత లేకుండా పుకార్లను వ్యాప్తి చేయడం ఆయా సంస్థల విశ్వసనీయతనే దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఇకనైనా హద్దులు దాటకుండా ప్రవర్తించాలని, పుకార్లను ప్రచురించే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని మీడియా సంస్థలకు సూచించింది. మేల్‌ స్టార్లకు ఇచ్చే గౌరవాన్నే ఫీమేల్ స్టార్ల‌కు కూడా ఇవ్వాలని, వారి ప్రైవసీని గౌరవించాలని డిమాండ్ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>