కలం, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) టార్గెట్‌ను మించిన ఆదాయం సంపాదించింది. స్క్రాప్‌ను అమ్మడం ద్వారానే 2026-26 ఏడాదిలో రూ.602.06 కోట్లు సంపాదించింది. అయితే స్క్రాప్ అమ్మకం విషయంలో రైల్వే బోర్డ్ తమకు రూ.510 కోట్ల టార్గెట్ పెట్టిందని, దానిని దక్షిణ మధ్య రైల్వే అదిగమించిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాదిలో దక్షిణ రైల్వే మొత్తంగా 1,32,583 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌ను (Scrap Sales) ఈ-ఆక్షన్ ద్వారా అమ్మిందని, తద్వారా స్క్రాప్ అమ్మకాల్లో పాదర్శనకతను పెంచామని అన్నారు. దాంతో పాటుగానే రైల్వే పరిసరాలు శుభ్రంగా ఉంచడం ద్వారా స్వచ్ఛభారత్‌కు సహకరిస్తున్నామని వివరించారు. గతేడాది స్క్రాప్‌ను అమ్మడం ద్వారా రూర.501.72 కోట్లు సంపాదించగా, ఈ ఏడాది వందకోట్ల రూపాయలు అధికంగా వచ్చాయని తెలిపారు. ఇది దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే స్క్రాప్ అమ్మడం ద్వారా వచ్చిన అత్యధిక ఆదాయంగా నిలిచిందని ఆయన చెప్పారు. ఈ రికార్డ్‌ను ఉద్దేశించి దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజన్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారులు, స్టాఫ్‌ను అభినందించారు.

