ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ‘నోపో’ భద్రత

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం రోజురోజుకు ఉద్రిక్తం అవుతోంది. యుద్ధం మొదలైన రెండు మూడు రోజుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలి ఖమేనీ (Ali Khamenei) ని శత్రుదేశాలు హత్య చేశాయి. దీంతో ఇరాన్‌లో పరిస్థితులు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తమ దేశ నూతన సుప్రీం లీడర్‌గా ఇరాన్.. అయతొల్లా మొజ్‌తాబా ఖమేనీ (Mojtaba Khamenei)ని ఎన్నుకున్నారు. ఆయనకు అత్యంత రక్షణ కల్పించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఎలైట్ కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్‌ను రంగంలోకి దించింది. అత్యంత శక్తివంతమైన ‘నోపో’ (NOPO) దళం రంగంలోకి దిగింది.

అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడిలో తండ్రి అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తబాను సురక్షితంగా ఉంచేందుకు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో ఆయన గాయపడ్డారని వార్తలు వచ్చాయి. కాగా మొజ్తబా క్షేమంగా ఉన్నారని ఇరాన్ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. మార్చి 8న ఆయనను సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నప్పటికీ, మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.

ఈ క్రమంలోనే ‘నోపో'(NOPO) ఎలైట్ కౌంటర్ టెర్రరిజం యూనిట్‌ను ఆయన రక్షణకు కేటాయించారు. 1991లో ఏర్పాటైన ఈ యూనిట్, ఇరాన్ పోలీసింగ్‌లోనే అత్యంత కఠినమైన, శక్తివంతమైన విభాగంగా పేరుగాంచింది. కేవలం ఆరు బ్రిగేడ్లతో కూడిన ఈ దళం, గతంలో అలీ ఖమేనీకి కూడా రక్షణ కవచంలా పనిచేసింది. సుప్రీం లీడర్ భద్రతతో పాటు జైళ్ల వద్ద కూడా ఈ దళాన్ని భారీగా మోహరించారు. రివల్యూషనరీ గార్డ్స్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన మొజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>