Mobile Popup Ad
Mobile Popup Ad

సినీ నటి హన్సిక విడాకులు.. అసలు కారణం ఏమిటి?!

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani)  తన భర్త సొహైల్ ఖతూరియాతో వివాహ బంధానికి ముగింపు పలికినట్టు తెలుస్తోంది. హన్సిక తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. కొంతకాలంగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని సమాచారం. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్ వీరి విడాకులను అధికారికంగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  హన్సిక మోత్వానీ, వ్యాపారవేత్త సొహైల్ ఖతూరియా 4 డిసెంబర్ 2022న జైపూర్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగేండ్లకే వీరు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదు. హన్సిక కోర్టును కూడా ఆశ్రయించలేదు. కానీ తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జీవనశైలి విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు రావడం, కొన్ని వ్యక్తిగత విభేదాలు వల్ల వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలపై తరచూ గొడవలు రావడంతో ఒకే ఇంట్లో నివసించడం కష్టంగా మారిందని సమాచారం. హన్సిక మోత్వానీ (Hansika Motwani) బాల నటిగా టీవీ షోలు చేసింది. తరువాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతోనూ తెలుగులో సినిమాలు చేశారు.

Read Also: డ్రంకెన్ డ్రైవ్‌లో ఒకరికి జైలుశిక్ష

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>