కలం, వెబ్ డెస్క్ : మహా కుంభమేళాలో పూసలు అమ్మిన మోనాలిసా భౌన్స్లే (Monalisa) ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. లుక్, గెటప్ అన్నీ మార్చేసింది. ఇలాంటి టైమ్ లో ఈ బ్యూటీ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. ఓ కేరళ యువకుడితో ప్రేమలో ఉన్నట్టు బయటపెట్టింది. ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచిపెట్టిన మోనాళిసా.. తాజాగా ప్రియుడితో కలిసి కేరళ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
ఏడాది క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా (Monalisa) ప్రేమలో పడింది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. కానీ మోనాలిసా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో.. తమకు రక్షణ కల్పించాలని వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈమె తెలుగులోనూ లైఫ్ అనే మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది. ఇంత కాలం సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కారణంగా ఛాన్సులు పట్టేసిన మోనాలిసా.. ఇప్పుడు ప్రియుడిని పెళ్లి చేసుకుంటుందా లేదంటే సినిమాల్లో కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి.
Read Also: రెండ్రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ల డెలివరీ : కేంద్రం
Follow Us On: Facebook

