epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదు: దానం నాగేందర్

కలం, వెబ్​ డెస్క్​ : తాను భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తెలిపారు. తనపై వచ్చిన అనర్హత పిటిషన్‌కు సంబందించి స్పీకర్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదని దానం నాగేందర్ పేర్కొన్నారు. 2024 మార్చి నెలలో తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనన్నారు. అయితే అది పూర్తిగా తన వ్యక్తిగత హోదాలో వెళ్లిన పర్యటన మాత్రమేనని ఆయన తెలిపారు. కేవలం మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని తాను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్ నాయకత్వం భావించడం సరికాదని దానం (Danam Nagender) పేర్కొన్నారు.

తాను పార్టీ ఫిరాయింపులకు (Party Defection) పాల్పడ్డానంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన స్పీకర్‌ను కోరారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేయనప్పుడు అనర్హత వేటు వేసే అవకాశం ఉండదని ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Read Also: బీఆర్ఎస్‌లో చేరిన ఆరూరి ర‌మేష్‌..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>