కలం, వెబ్ డెస్క్: ఏఐ (AI) టెక్నాలజీ కారణంగా సెలబ్రిటీలు, ప్రముఖులు, నటీనటులు డీప్‌ఫేక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ అనుమతి లేకుండా ఏఐ వీడియోలు సృష్టిస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌కు (Akira Nandan) సంబంధించిన ఓ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏఐ ఆధారంగా డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ మేరకు కాకినాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
నిందితులు అనుమతి లేకుండా అకీరా నందన్‌పై “లవ్ స్టోరీ” అనే డీప్‌ఫేక్ వీడియోను యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై రిలీజ్ చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు AI ద్వారా తన వ్యక్తిత్వం, గోప్యత హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ అకీరా నందన్ (Akira Nandan) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ను ఆశ్రయించాడు. యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఎక్స్‌లో నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలిగించాలని కోరుతూ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Read Also: “హ్యాపీ” మూవీకి 20 ఏళ్లు .. అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Follow Us On : WhatsApp


