epaper
Friday, January 23, 2026
spot_img
epaper

దగ్గుబాటి కోర్టు వివాదంపై లీగల్​ టీమ్​ క్లారిటీ

కలం, వెబ్​ డెస్క్​ : దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టు కేసు (Daggubati Court Case)కు సంబంధించి సోషల్ మీడియా, కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలపై సురేశ్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ స్పందించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కేసులో దగ్గుబాటి సోదరులకు కోర్టులో చుక్కెదురైందని, వారిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు’ అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని లీగల్ టీమ్ స్పష్టం చేసింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని కోర్టు వ్యాఖ్యానించిందన్న ప్రచారాన్ని వారు ఖండించారు.

ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందన్న వార్త అవాస్తవమని వారు పేర్కొన్నారు. కోర్టు ప్రొసీజర్‌లో భాగంగా ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా పడిందని, వారెంట్లు జారీ కాలేదని వివరించారు. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సురేశ్ ప్రొడక్షన్స్ లీగల్ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. అవాస్తవాలను ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>