కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని మొలకల చెరువు కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేశ్ (Jogi Ramesh), ఆయన సోదరుడు రాముకు తంబళ్లపల్లె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 85 రోజుల తర్వాత నేడు సాయంత్రం 6 గంటలకు జోగి బ్రదర్స్ జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ సబ్ జైల్లోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసులో బెయిల్ వచ్చినా జోగి బ్రదర్స్ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ రావడంతో జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు. అద్దేపల్లి జనార్ధన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సిట్ అధికారులు జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కల్తీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని విజయవాడ కనకదుర్గ ఆలయంలో జోగి రమేశ్ (Jogi Ramesh) ప్రమాణం కూడా చేశారు. ఆ తర్వాత సిట్ విచారణలో అద్దేపల్లి జనార్ధన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆ తర్వాతనే జోగి బ్రదర్స్ ను అరెస్ట్ చేశారు అధికారులు. పలుమార్లు జోగి బ్రదర్స్ ను కస్టడీలోకి తీసుకున్నారు. బెయిల్ కోసం జోగి రమేశ్ కుటుంబీకులు ప్రయత్నించినా.. కోర్టులు తిరస్కరించాయి. అటు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో గతంలోనే ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ మొలకల చెరువు కల్తీ లిక్కర్ కేసులో బెయిల్ రాకపోవడంతో జోగి బ్రదర్స్ ఇన్ని రోజులు జైల్లోనే ఉండిపోయారు.


