కలం, వెబ్ డెస్క్ : జగిత్యాల (Jagtial) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగారు. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడి ఎదుట బైఠాయించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అయితే నిబంధనలు ఉల్లంగించి గుడిలోకి కార్యకర్తలను ఎందుకు అనమతించారని ఆలయ ఈవో శ్రీకాంత్ రావు (Srikanth Rao) అర్చకులపై, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అర్చకులకు గౌరవం ఇవ్వాలంటూ ఆలయ అర్చకులు ధర్నాకు దిగారు.


